HNK: బాలసముద్రంలోని శ్రీనివాస కాలనీ వీధిలో 3 రోజులుగా నెమలి సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూపార్క్ వెనుక భాగం నుంచి గుట్ట మీదుగా వస్తున్న నెమలి దారి తప్పి కాలనీలోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఆహారం కోసం వెతుకుతూ కాలనీలో తిరుగుతుండగా కాలనీ వాసులు గమనించి అధికారులకు సమాచారం అందించగా స్పందించట్లేదని పేర్కొన్నారు.