PDPL: గోదావరిఖని ప్రశాంత్ నగర్లోని చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే MS రాజ్ ఠాగూర్ తెలిపారు. ఆయన ఇవాళ రూ. 2.53 కోట్లతో చేపట్టే చెరువు పునరుద్ధరణ పనులకు మేయర్ మహంకాళి స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. చెరువు పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరిగి, పర్యావరణం సమతుల్యం అవుతుందని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.