NRPT: గుండుమల్ మండలం భక్తిమల్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ గేదె మృతి చెందింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా, రైతు వినాయకకు చెందిన గేదె వ్యవసాయ పొలం వద్ద పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీని విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యారు.