GDWL: అలంపూర్ కోనేరు జమ్ములమ్మ వద్ద జరిగిన ప్రమాదంలో తెలుగు సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం సురేష్ టెంటు తాడు కడుతుండగా, నిలిపి ఉంచిన ట్రాక్టరును బైరంపల్లికి చెందిన బోయ స్వాములు గేర్లో ఉండగానే స్టార్ట్ చేశాడు. ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకురావడంతో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.