SRPT: నూతనకల్ మండలం పెదనెమిలలో ఈరోజు రెవెన్యూ అధికారులు ఆధునిక సాంకేతికతతో రీ-సర్వే చేపట్టారు. సర్వేయర్లు ప్రతి రైతు భూమి సరిహద్దులను పక్కాగా నిర్ధారిస్తున్నారు. ఈ సందర్భంగా జీపీవో కవిత మాట్లాడుతూ.. ఈ ప్రక్రియతో సరిహద్దు వివాదాలు తొలగిపోతాయని, సర్వే అనంతరం అందరి రైతులకు ప్రత్యేక ‘భూధార్’ నంబర్ కేటాయిస్తామని ఆమె తెలిపారు.