KMR: బీబీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలను తన సొంత నిధులతో, కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న, విద్యావేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.