NZB: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 1 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.