MBNR: రాజాపూర్ మండల కేంద్రంలోని శివారు బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం వీచిన భారీ గాలులకు వృక్షం విరిగిపడింది. ఇదే సమయంలో ఆటో ప్రమాదానికి గురై రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, హైవే అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.