KNR: చొప్పదండి మండల వ్యవసాయ అధికారిణిగా ఎం.మమత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ రైతు శిక్షణ కేంద్రం నుంచి ఆమె ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ ఎనిమిదేళ్లపాటు సేవలు అందించిన ఏవో వంశీకృష్ణ కరీంనగర్ అర్బన్ రైతు శిక్షణ కేంద్రానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎంఏవో మాట్లాడుతూ.. రైతులకు ఎల్లవేళలా సేవలందిస్తామన్నారు.