NRPT: విద్యా రంగానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు హైమావతి డిమాండ్ చేశారు. శుక్రవారం అంబేడ్కర్ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల హెల్త్ కార్డులను అమల్లోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ నేతలు, తదితరులు పాల్గొన్నారు.