HNK: ఇంటర్ ఫలితాల్లో 997 మార్కులు సాధించిన సాయి శ్రేష్ఠితను నేడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సన్మానించారు. చదువు మన తలరాతను మారుస్తుందని, భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలని, హనుమకొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సాయి శ్రేష్ఠితకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.