ప్రముఖ కార్ల సంస్థ సిట్రోయెన్ తన ‘బసాల్ట్’ మోడల్ కార్ల ధరలను రూ.40,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముడిసరుకు ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. దీనివల్ల ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.8.55 లక్షలకు చేరింది. ఇతర మోడళ్ల ధరలు కూడా వేరియంట్‌ను బట్టి ధరలు పెంచింది. కొత్తగా కారు కొనాలనుకునే వారు ఇప్పుడు మరికొంత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.