WGL: కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో కనకదుర్గమ్మ దేవాలయాన్ని MLC బస్వరాజు సారయ్య సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని, కనకదుర్గమ్మ ఆలయ సమగ్రాభివృద్ధికి సహకరిస్తానని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.