MHBD: మరిపెడ మండలంలోని తెలంగాణ గిరిజన మినీ గురుకులంలో (బాలికల) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి పి.రత్నకుమారి నేడొక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30సీట్లు, బ్యాక్లాగ్ వేకెన్సీలు 2వ తరగతిలో 4 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు గురుకులంలో సంప్రదించాలన్నారు.