GDWL: జిల్లాలోని ఉండవల్లి టోల్ ప్లాజాలో అకారణంగా తొలగించిన ముగ్గురు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా నేతలు ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ శనివారం డిమాండ్ చేశారు. గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న బి. మద్దయ్య, జి. రాజశేఖర్, వెంకట్ రాముడులను వేతనాలు, బోనస్ గురించి ప్రశ్నించినందుకే యాజమాన్యం అన్యాయంగా తొలగించిందని విమర్శించారు.