VZM: జామి మండలంలోని ఎంకె. వలస గ్రామంలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో రూ. 74 లక్షలతో నిర్మించే సీసీ రహదారులు, డ్రైన్ల పనులకు ప్రారంభోత్సవం చేశారు. మండలంలో 12 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ ద్వారా రు. 23 కోట్ల నిధులు విడుదలయ్యాయని మంత్రి కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.