KRNL: ఆదోనిలోని శ్రీనివాస్ భవనంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను శనివారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సందర్శించి, అల్పాహారం స్వీకరించారు. ఆహార నాణ్యతను పరిశీలించి, ఆహార తయారీలో నియమాలు తప్పకుండా పాటించాలని, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆహారంలో ఏవైనా లోపాలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.