AP: పరిటాల రవి వంటి నాయకుడిని ఎప్పటికీ మరువలేమని సినీ నటి, మాజీ MP జయప్రద అన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆయన భార్య, రాప్తాడు MLA పరిటాల సునీత కనిపించిన సందర్భంగా జయప్రద కుశలప్రశ్నలు వేసి, రవిని గుర్తుచేసుకున్నారు. ఆయన తన ప్రాంత అభివృద్ధికి ఎంతో తపించేవారని, అక్కడ ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పక వస్తానని సునీతకు జయప్రద చెప్పారు.