JN: చిల్పూర్ మండల కేంద్రంలోని చిల్పూర్ గుట్ట క్రింద సీపీఎం మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి సాదం రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. మండలంలో NREGS ద్వారా ఎంపికైన అన్ని పనులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.