కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ వార్షిక వేతనం 18 శాతం పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం 10.7 మిలియన్ డాలర్ల(సుమారు రూ.89 కోట్లు) పారితోషికాన్ని అందుకున్నారు. 2024తో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. ఐటీ రంగంలో నెలకొన్న సవాళ్ల మధ్య కూడా రవి కుమార్ నాయకత్వానికి గుర్తింపుగా కంపెనీ ఈ పెంపును ప్రకటించింది. ప్రస్తుత ఐటీ మార్కెట్లో ఈ శాలరీ హైక్ చర్చనీయాంశంగా మారింది.