సత్యసాయి: సోమందేపల్లిలోని రైతులకు ఎస్సై సుధాకర్ యాదవ్ శనివారం రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. రహదారిపై రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడం వల్ల వాహనదారులు స్కిడ్ అవుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్సై తెలిపారు. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో లేదా టార్పాలిన్ షీట్లపై ఆరబెట్టుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు అమూల్యమైనవని, రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.