KMR: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన ఘటన రామారెడ్డి శివారులో శనివారం చోటుచేసుకుంది. రమారెడ్డి మండలంలోని ఇసన్న పల్లి గ్రామ సర్పంచ్ డోకి లచ్చయ్యకు చెందిన గొర్రెల మంద మేతకు వెళ్తున్న క్రమంలో అన్నారం నుంచి కామారెడ్ది వస్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందను ఢీకొనడంతో 7 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.