KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ పరిధిలో 23 మంది రౌడీషీటర్లకు ఏఎస్పీ విభుకృష్ణ, ఐపీఎస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. తిరిగి నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలతో పాటు జిల్లా బహిష్కరణ, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు తెలిపారు.