VSP: మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లేని రాజకీయ డ్రామా అని భారత సమాజ్ డెవలప్ పార్టీ అధ్యక్షుడు చింతాడ సూర్యం విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో బిల్లును ఆలస్యం చేసి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వం సమన్వయం చేయలేకపోయిందన్నారు.