NTR: జి.కొండూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని, పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. మీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని, మైలవరం నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు.