ADB: ప్రమాదానికి గురైన క్షతగాత్రులను సరైన సమయానికి ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడాలని తాంసి మండల పోలీసులు సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద బాధితుని ఆసుపత్రిలో తరలించి ప్రాణాలను కాపాడిన పోన్నారికి గ్రామానికి చెందిన ముచ్చ రఘును ASI ఉత్తం సిబ్బందితో కలిసి శనివారం సత్కరించి అభినందించారు. సిబ్బంది రమేష్, పోచన్న, సాగర్ రామారావు తదితరులున్నారు.