KMR: దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.కోటి విరాళం ఇచ్చారు. మండల కేంద్రానికి చెందిన వ్యాపారి విజయ్ కుమార్ పాఠశాలలో తరగతి గది నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదవుకోవాలన్న ఉద్దేశంతో అదనపు గదులు నిర్మించడం జరుగుతుందన్నారు.