KRNL: రామదుర్గంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ఐసీడీఎస్ సీడీపీవో నరసమ్మ, సూపర్వైజర్ వీరమ్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం కళాకారుల పాటలు, నాటికల రూపంలో బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. చిన్న వయసులో వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్యావకాశాలు, జీవిత భవిష్యత్తు ఎలా దెబ్బతీస్తాయో చాటి చెప్పారు.