‘రాజా శివాజీ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో జెనీలియా తన ఫ్యామిలీ సీక్రెట్స్‌ను షేర్ చేసుకుంది. తమ పిల్లల కోసం రితేష్ దేశ్‌ముఖ్ ఒక ప్రత్యేకమైన రూల్ పెట్టారని తెలిపింది. పిల్లల కోసం రితేష్ ప్రతి వారం ఒక ఐకానిక్ హిందీ సినిమా చూసే నిబంధన పెట్టారని, అయితే పిల్లల కంటే ఆయనే సినిమాలో లీనమైపోతారని సరదాగా చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.