NTR: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా అనిల్ చంద్ర పునేఠా విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్‌కు చెందిన సీనియర్ IAS అధికారి అయిన ఆయనను ప్రభుత్వం ఈ పదవిని నియమించింది. గత నెల 31తో ఎస్ఈసీ నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో ఈ నియామకం జరిగింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేస్తున్న పునేఠా కొత్త బాధ్యతలు చేపట్టారు.