NLR: సంతపేట పోలీసులు బీహార్‌కు చెందిన ఐదుగురు మోసగాళ్లను అరెస్టు చేశారు. వీరు రైల్వే స్టేషన్లలో లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని, టికెట్లు కన్ఫర్మ్ చేస్తామని నమ్మించి, వారి ఫోన్ల నుంచి ఓటీపీలు తీసుకుని డబ్బులు దొంగిలించేవారు. నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష ఈ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు.