AKP: ఈ నెల 26 నుంచి 28వరకు తిరుపతిలో ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. ఈ మేరకు నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో మంగళవారం సభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ సభలను జయప్రదం చేయాలి అన్నారు.