SRCL: వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ కార్యక్రమాల కోసం భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని సోమాజిగూడకు చెందిన భక్తులు నీలగిరి శంకర్ రావు, ప్రసూన దంపతులు ఆలయ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని వారు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారికి సమర్పించారు.