AP: మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండటంపై సెక్యూరిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ వద్ద రద్దీని గమనించిన మంత్రి, రోగులకు ఇబ్బంది కలగకుండా కౌంటర్ల సంఖ్య పెంచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.