చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. SRHతో పోరులో గాయపడిన అతడిని పరీక్షించిన వైద్యులు, కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, మాత్రే త్వరగా కోలుకొని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ CSK సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.