SKLM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చొరవతో పెంట గ్రామంలో తాగునీటి సమస్య తీరింది. ఆదివారం ప్రజా దర్బార్లో గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, ఆయన వెంటనే అధికారులతో మాట్లాడారు. అధికారుల స్పందనతో కేవలం ఒక్కరోజులోనే కొత్త బోరు ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం సర్పంచ్ ప్రతినిధి నాగేశ్వరరావు ప్రారభించారు. సమస్యను వేగంగా పరిష్కరించిన ఎంపీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.