MNCL: దండేపల్లి మండలంలోని ముత్యంపేటలో డబ్బులు ఇవ్వనందుకు బిల్లా శంకరయ్య దంపతులపై రాడ్తో దాడి చేసిన తూర్పాటి కనకయ్యను అరెస్ట్ చేశామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి శంకరయ్య దంపతులపై కనకయ్య దాడి చేయగా, ఆస్పత్రిలో శంకరయ్య మృతి చెందాడన్నారు. కనుకయ్యను ఎల్లారం వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు.