MHBD: గూడూరు మండలం దామరవంచకి చెందిన మాజీ ఎంపీటీసీ స్వాతి రవినాయక్, వార్డుమెంబర్ గాదె వెంకట్లు మంగళవారం BRS జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవితను కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి వారు చర్చించారు. నిన్న జగిత్యాల సభలో KCR ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కవిత సూచించారు.