NTR: నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామ మూలమలుపు వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో సుమారు 20 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయాలైన వారంతా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామం వారిగా సమాచారం.