PLD: నరసరావుపేట వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ నాగూర్ బాబు అలియాస్ హన్నుపై నిన్న రాత్రి దాడి జరిగింది. ఈ ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, పెట్టిన 324 సెక్షన్ను 307గా మార్చాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.