BDK: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల ద్వారానే విక్రయించాలని పిలుపునిచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.