అన్నమయ్య: చిన్నమండెం మండలం బెస్తపల్లిలోని ప్రైమరీ స్కూల్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించి, గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.