TPT: తిరుపతికి చెందిన V.N మొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీకి రూ. 95 వేలు విలువైన ఫ్రాన్స్క్రిన్ ఈవీ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అప్పల నాయుడు, వెంకట రమణలు శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి సూపరింటెండెంట్ శ్రీనివాసులుకు వాహనం తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.