TG: టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారుల కమిటీ.. ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి అందుతున్న వినతులను పరిశీలించి.. వాటికి తగిన సిఫార్సులు చేయనుంది. నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించనుంది.