‘స్టోరేజ్ వార్స్’ ఫేమ్, ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ డారెల్ షీట్స్ (67) కన్నుమూశారు. ఆరిజోనాలోని తన నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ప్రాథమిక విచారణలో అది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ‘గ్యాంబ్లర్’గా గుర్తింపు పొందిన ఆయన మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.