AP: అనకాపల్లి జిల్లాలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనుండటం శుభసూచికమని మంత్రి లోకేష్ అన్నారు. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్.. మరోసారి దేశానికి దారిచూపుతోందని తెలిపారు. పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానమన్నారు. ఇంకా చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులను ముందుకు రావాలని కోరారు.