SRPT: పాలేరు జలాశయం ఫాలింగ్ గేట్ల వద్ద సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని తుమ్మలపల్లికి చెందిన అబ్దుల్ పాషా (45) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.