AP: తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం కాపవరం పాండవుల కొండపై పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని గుర్తిస్తున్నారు. మరోవైపు పెద్దపులి సంచారంతో కోరుకొండ, కాపవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే పులి ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలో ఉన్నారు.