KMR: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన పద్మ అనే గర్భిణి గురువారం పురిటి నొప్పులతో, బాధపడుతూ 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికం కావడంతో, 108 సిబ్బంది క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవం చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.