KMM: పాలేరు జలాశయం ఫాలింగ్ గేట్ల వద్ద సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మలపల్లికి చెందిన అబ్దుల్ పాషా (45) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేపచెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నేలకొండపల్లి మార్చరీకి తరలించారు.